ఇంటికి వస్తానన్న కొడుకు.. చివరికి విషాదం

278చూసినవారు
విజయనగరం జిల్లాలోని ఓ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి వికాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. యానాం సమీపంలోని పల్లిపాలెంకు చెందిన వికాస్, ఒంట్లో బాగోలేదని, ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు అతని తండ్రి తెలిపారు. ఈ ఘటనపై వికాస్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్తవలస ఇన్‌‌స్పెక్టర్ షణ్ముఖరావు ఈ వివరాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్