ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో సోమవారం ఉదయం వంట చేస్తుండగా పేపకాయల చిట్టితల్లి (54) అనే మహిళ దుర్మరణం పాలైంది. పొయ్యి వెలిగిస్తుండగా చీరకు నిప్పు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, బుధవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.