యానాంలో శుక్రవారం, చొక్కా కుట్టినందుకు కేవలం రూ. 20 బకాయి అడిగినందుకు ఓ యువకుడు దర్జీపై ఇనుప ఆయుధంతో దాడి చేసి పళ్ళు ఊడగొట్టిన ఘటన చోటుచేసుకుంది. మెట్టకూరు వంశీకృష్ణ కాలనీకి చెందిన టైలర్ ఈగల మల్లికార్జునరావు వద్ద కొప్పనాతి వెంకటరమణ అనే యువకుడు చొక్కా కుట్టించుకున్నాడు. బకాయి డబ్బులు అడిగినందుకు ఆగ్రహంతో వెంకటరమణ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన దర్జీకి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై కుమరన్, ఏఎస్సై గణేష్‌లు నిందితుడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ నిందితుడికి ఆరు రోజుల రిమాండ్ విధించారు.