పిఠాపురం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి

990చూసినవారు
పిఠాపురం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి
పిఠాపురం మున్సిపాలిటీలో శానిటేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న దళిత ఉద్యోగి సుధీర్ పై అసభ్యకర బూతులతో రెచ్చిపోయిన మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు పై చర్యలు తీసుకోవాలని నిడదవోలు సచివాలయం ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిడదవోలు మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పిఠాపురం కమీషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్