ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో శనివారం దీన్ దయాల్ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి సింహాద్రి సత్యనారాయణ బెనర్జి ముఖ్య అతిథిగా హాజరై, ఉపాధ్యాయ జనసంఘ్ నుండి బీజేపీ కొనసాగిన విధానాన్ని వివరించారు. ఓటు ఫామ్ 6, ఫామ్ 7, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. తాడిపర్రులో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో ఓటుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అక్కిన గోపాలకృష్ణ, కొప్పినీడి సత్యనారాయణ, కరుటూరి నరేంద్రబాబు, బూరుగుపల్లి శివరామకృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.