తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని తీపర్రు గ్రామ పంచాయతీలో నూతన ఉపాధి హామీ చట్టం (VB-GRAM G)పై గ్రామసభను గురువారం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కంటిపూడి సూర్యనారాయణ పాల్గొని, గ్రామీణ కూలీలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను వివరించారు. ఈ గ్రామసభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొగుళ్లపూడి సీతారాం, జనసేన పార్టీ అధ్యక్షులు పత్తిపాటి ప్రసాద్ కుమార్, గ్రామ పెద్దలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.