జన్మ భూమి ఎక్స్ప్రెస్ కు హాల్ట్ ఇప్పించాలి.. జువ్వల రాంబాబు

353చూసినవారు
నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు, మంత్రి కందుల దుర్గేశ్‌ను కలిసి నిడదవోలు రైల్వే జంక్షన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ కల్పించాలని శనివారం కోరారు. అమృత్ భారత్ స్టేషన్‌గా ఉన్న నిడదవోలును కాదని, అనపర్తికి హాల్ట్ ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రికి విన్నవించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్