నిడదవోలు నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల్లో 29వ వార్డు కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన నెల్లూరు జ్యోతిని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. ఈ మేరకు బుధవారం మంత్రి ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయానంతరం
బీజేపీ నిడదవోలు పట్టణ ఉపాధ్యక్షుడు చామంతి భీమేశ్వరరావు కూడా నెల్లూరు జ్యోతిని ప్రత్యేకంగా అభినందించారు. నిడదవోలు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విజేతగా నిలిచిన నెల్లూరు జ్యోతికి ఈ ప్రముఖులు అభినందనలు తెలపడం స్థానికంగా చర్చనీయాంశమైంది.