ముంబయి పర్యటనకు వెళ్ళనున్న మంత్రి కందుల

595చూసినవారు
ముంబయి పర్యటనకు వెళ్ళనున్న మంత్రి కందుల
నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఏప్రిల్ 8, 9 తేదీల్లో ముంబయిలో పర్యటించనున్నారు. స్థానిక గ్రాండ్ హయత్ హోటల్ లో జరిగే 21వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియాలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలోని పెట్టుబడి అవకాశాలను, పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వివరిస్తారు.