తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి ప్రజల సౌకర్యార్థం కొత్త పల్లెవెలుగు బస్సు సేవలను బుధవారం ప్రారంభించారు. నిడదవోలు నుంచి రాజమహేంద్రవరం, తిరిగి రాజమహేంద్రవరం నుంచి నిడదవోలుకు ఈ సర్వీసులు నడవనున్నాయి. ఉదయం 8:30 గంటలకు నిడదవోలు నుంచి బయలుదేరే బస్సు చంద్రమవరం, మల్లవరం, కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం చేరుతుంది. మధ్యాహ్నం 2:00 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే బస్సు కొవ్వూరు, మల్లవరం, చంద్రవరం, దారవరం మీదుగా నిడదవోలు చేరుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని బస్సు సేవలను పునరుద్ధరించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.