నిడదవోలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద సర్వీస్ రోడ్డును సక్రమంగా వేయాలని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ, ఆర్వోబి నిర్మాణం కారణంగా వేసిన సర్వీస్ రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డును మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.