తాడిపర్రులో పల్స్ పోలియో కార్యక్రమం: గోపాలకృష్ణ చేతుల మీదుగా చిన్నారులకు చుక్కలు

1184చూసినవారు
తాడిపర్రులో పల్స్ పోలియో కార్యక్రమం: గోపాలకృష్ణ చేతుల మీదుగా చిన్నారులకు చుక్కలు
నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్