నిడదవోలు పాటిమీద గురువారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా ఆగిన లారీని ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనదారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్లపై వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.