పెరవలి మండలం నడుపల్లి కోట గ్రామంలో సోమవారం, సమగ్ర శిక్ష నిధులతో రూ. 23.95 లక్షల వ్యయంతో నిర్మించనున్న పాఠశాల అదనపు తరగతి గదికి మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, నాణ్యమైన విద్యకు సరిపడా తరగతి గదులు, సదుపాయాలు అవసరమని ఆయన తెలిపారు.