నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు ఎర్రకాలువపై రైతులకు దీర్ఘకాలంగా ఉన్న ముంపు సమస్య పరిష్కారానికి కీలక చర్యలు చేపట్టారు. 26.050 కి.మీ. వద్ద 3 షట్టర్లు, 27.575 కి.మీ. వద్ద 5 షట్టర్లు, మొత్తం 8 షట్టర్లను సుమారు రూ. 51 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. శెట్టిపేట లాకుల నుంచి వస్తున్న బ్యాక్ వాటర్ వల్ల గేట్ల ఏర్పాటుకు ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే సంబంధిత ఇరిగేషన్ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.