రీ సర్వే పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి

562చూసినవారు
ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రీ-సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలని, ప్రతి రైతుకు సరైన సమాచారం అందించి, వారి సమక్షంలోనే కొలతలు చేపట్టాలని సూచించారు. ఈ పనులు రైతులకు న్యాయం చేకూర్చేలా ఉండాలని ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్