
కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ బిందు మాధవ్
కాకినాడ జిల్లాలోని సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వద్ద జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాలను ఆదివారం ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. ఆయన దర్శనాల కోసం ఏర్పాటుచేసిన క్యూ లైన్లను, పుణ్యస్నానాలు ఆచరిస్తున్న కోనేరు జలాశయాన్ని పరిశీలించారు. కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను కూడా ఆయన పరిశీలించారు.




































