ఫిబ్రవరి 22న పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో జరగనున్న పెద్దాపురం పిల్లల పండుగను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పండుగ లోగోను ఆవిష్కరించారు. ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పండుగ నిర్వహణపై చర్చించారు.