గోదావరి కాలువలో పడి వృద్ధుడు గల్లంతు

1344చూసినవారు
సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద గురువారం గోదావరి కాలువలో ఆరుమిల్లి రామారావు అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. రేవు వద్ద కాలువలోకి ఆయన జారిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. వృద్ధుడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది.

సంబంధిత పోస్ట్