శుక్రవారం, పెద్దాపురంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దాపురం మెయిన్ రోడ్ లోని గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయి ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, గాంధీజీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.