జూలై 11న పెద్దాపురంలో జాతీయ లోక్ అదాలత్

1797చూసినవారు
జూలై 11న పెద్దాపురంలో జాతీయ లోక్ అదాలత్
హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 11న పెద్దాపురం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు 7వ అదనపు జిల్లా జడ్జి ఎన్. సరస్వతి తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, మోటార్ ప్రమాద పరిహారం, మునిసిపల్ చలానాలు, బ్యాంకు, బీఎస్ఎన్ఎల్ బకాయిలకు సంబంధించిన పెండింగ్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం కల్పించబడుతుంది. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కోర్టు ఫీజు కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సమీప పోలీస్ స్టేషన్ లేదా కోర్టులోని మండల న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్