రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పెద్దాపురం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కె. ప్రసాద్, ఎస్ఐ వి. మౌనిక సూచించారు. గురువారం పెద్దాపురం మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం నుండి పట్టణంలో ప్రతి వాహనదారుడు కచ్చితంగా హెల్మెట్ ధరించేలా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.