పెద్దాపురం: వేతన చట్టాన్ని అమలు చేయాలని అంగన్వాడీల ఆందోళన

1373చూసినవారు
పెద్దాపురంలో మంగళవారం అంగన్వాడి వర్కర్లు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రాజెక్టు కార్యదర్శి ఎస్తేరు రాణి మాట్లాడుతూ, ఐసీడీఎస్ పథకం ప్రారంభమై 50 ఏళ్లు అయినా, సేవలు అందిస్తున్న వర్కర్లకు కనీస వేతనం లభించడం లేదని, కూటమి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్