పెద్దాపురం: ప్రీ ప్రైమరీల నిర్వహణపై అంగన్వాడీల ఆందోళన

2466చూసినవారు
పెద్దాపురం: ప్రీ ప్రైమరీల నిర్వహణపై అంగన్వాడీల ఆందోళన
విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ, సీఐటీయూ నేతలు సోమవారం మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేత పద్మ మాట్లాడుతూ, అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేత క్రాంతి కుమార్, అంగన్వాడీ మహిళలు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్