సామర్లకోట మున్సిపల్ పరిధిలో ఇంటి, నీటి పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య హెచ్చరించారు. గురువారం, పన్ను బకాయిలు చెల్లించని మూడు ఇళ్లకు నీటి సరఫరా కనెక్షన్లను తొలగించారు. ఫిబ్రవరి 5 వరకు కూడా బకాయిలు చెల్లించని వారిపై మరిన్ని చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.