పెద్దాపురం మండలం దివిలి చంద్రమాంపల్లి ఉపసర్పంచ్ వెన్నా సత్యనారాయణ (పండు) గురువారం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. పూజలో ఉండగానే ఆయన అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. గుండెపోటుతోనే ఆయన మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఉపసర్పంచ్ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.