పెద్దాపురం పరిధిలో దారి దోపిడీ కేసు రుజువు కావడంతో, పెద్దాపురం మున్సిఫ్ మేజిస్ట్రేట్ జి. బుల్లమ్మ బుధవారం ఇద్దరికి 5 నెలల జైలు శిక్ష విధించారు. గత ఏడాది అక్టోబరు 29న మేక హరీష్ అనే సూపర్వైజర్ ను రంగంపేట మండలం వడిశలేరు నుంచి పెద్దాపురం వస్తుండగా, ఏడీబీ రహదారి దుర్గమ్మ ఆలయం వద్ద సురకశుల రాజేష్ కుమార్, దేవుపల్లి సాయి రఘు వీర మణికంఠ అలియాస్ కిట్టుతో పాటు మరో బాలుడు అడ్డగించి, బెదిరించి, ఫోన్ పే ద్వారా నగదును దోచుకున్నారు. ఈ ఘటనపై పెద్దాపురం ఎస్సై వి. మౌనిక కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం ఇద్దరికి శిక్ష పడింది. బాలుడిని జువైనల్ హోంలో ఉంచారు.