గొల్లప్రోలు విద్యార్థుల ఘన విజయం.. 17 ట్రిపుల్ ఐటీ సీట్లు

383చూసినవారు
గొల్లప్రోలు విద్యార్థుల ఘన విజయం.. 17 ట్రిపుల్ ఐటీ సీట్లు
గొల్లప్రోలు మండల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచి 17 ట్రిపుల్ ఐటీ సీట్లను సాధించారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గొల్లప్రోలు నుంచి 7 మంది, దుర్గాడ, తాటిపర్తి పాఠశాలల నుంచి ముగ్గురు చొప్పున, బాలుర ఉన్నత పాఠశాల గొల్లప్రోలు నుంచి ఇద్దరు, వన్నెపూడి, కొడవలి పాఠశాలల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీట్లు పొందారు. ఎంపికైన విద్యార్థుల్లో 10 మందికి శ్రీకాకుళం, నలుగురికి ఆర్కే వ్యాలీ, ఇద్దరికి నూజివీడు, ఒకరికి ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు లభించాయి. అధికారులు విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.

సంబంధిత పోస్ట్