మూలపేట జడ్పీ పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్

3578చూసినవారు
మూలపేట జడ్పీ పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్
కొత్తపల్లి మండలంలోని మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాలు పూర్తయ్యాయి. జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఈ పాఠశాలలో 7, 8, 9, 10 తరగతులకు సీట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు 'అడ్మిషన్స్ ఫుల్' బోర్డును ఏర్పాటు చేశారు. నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, గత విద్యాసంవత్సరాల్లో సాధించిన ఉత్తమ ఫలితాల కారణంగా ఈ పాఠశాలకు ప్రతి ఏటా విద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఉపాధ్యాయులు తెలిపారు. సీట్లు లేకపోవడంతో కొత్తగా చేరేందుకు వచ్చిన పలువురు విద్యార్థులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని స్థానికులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్