అనుమతుల్లేని కాన్వెంట్లపై చర్యలు కోరిన అంగన్వాడీ యూనియన్

2618చూసినవారు
అనుమతుల్లేని కాన్వెంట్లపై చర్యలు కోరిన అంగన్వాడీ యూనియన్
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ కాన్వెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం యు. కొత్తపల్లి ఎంఈవో కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. 2 నుంచి 4 ఏళ్ల చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోనే చేర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్