కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి వృద్ధ దంపతుల ఇంట్లో దొంగతనం జరిగింది. కర్రి సూరిబాబు (70), కర్రి మాలచ్చిమి (65) వరండాలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లు గుర్తించారు. అర కాసు శతమానాలు, ఒక కాసు బంగారు ఆభరణం, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.