పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో దుర్గాదేవి ఆధ్వర్యంలో బాల్య వివాహ వ్యతిరేక ప్రచార కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్య వివాహం చట్ట విరుద్ధమని, బాల్య వివాహ నిషేధ చట్టం–2006 ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకుండా వివాహం నేరం అని తెలిపారు. ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమాన విధిస్తామని హెచ్చరించారు.