ప్రమాదకర పనుల్లో మహిళలకు ఉపాధి కల్పించొద్దు

346చూసినవారు
ప్రమాదకర పనుల్లో మహిళలకు ఉపాధి కల్పించొద్దు
శనివారం చేబ్రోలులోని ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న మహిళలకు లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో కార్మిక చట్టాలు, భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం 12వ అదనపు జిల్లా కోర్టు ప్యానల్ న్యాయవాదులు మాట్లాడుతూ, ప్రమాదకరమైన పనుల్లో మహిళలను నియమించడం చట్టవిరుద్ధమని తెలిపారు. మహిళలు తమ హక్కులు, పనిస్థల భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని న్యాయవాది నూకరాజు సూచించారు.

సంబంధిత పోస్ట్