జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లే ప్రతినిధి బృందంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఫైవ్ మెన్ కమిటీ సభ్యుడు పెండెం దొరబాబుకు అవకాశం లభించింది. ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దొరబాబును పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న వేళ, అధినేత వెంట ఢిల్లీ పర్యటనకు ఎంపిక కావడం ఆయనకు పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ప్రాధాన్యతగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా
జనసేన శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.