పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో నేటి నుంచి అన్ని వార్డుల్లో కొళాయిల ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. పాదగయ జంక్షన్ వద్ద మెయిన్ పైపులైన్ మరమ్మతుల నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కనకారావు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి యధావిధిగా తాగునీటి సరఫరా పునఃప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.