పిఠాపురం మండలంలో రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ

489చూసినవారు
పిఠాపురం మండలంలో రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ
పిఠాపురం మండలంలోని పీ. తిమ్మాపురం, వెల్దుర్తి గ్రామాల్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం విస్తృతంగా ధాన్యం కొనుగోళ్లు ఎంఎస్పీ ధరలకే నిర్వహిస్తోందని, కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. గతంలో రైతులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని విమర్శించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్లే రెండు పంటలు సాధ్యమవుతున్నాయని, గిట్టుబాటు ధరలు రాకపోతే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్