గొల్లప్రోలు: 17వ వార్డులో దోమల నివారణ చర్యలు

90చూసినవారు
గొల్లప్రోలు: 17వ వార్డులో దోమల నివారణ చర్యలు
పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం 17వ వార్డులో దోమల నివారణ చర్యలు చేపట్టారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేకంగా మందు పిచికారీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 17వ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ మొగలి రాజా, దోమల వల్ల వచ్చే వ్యాధులను నివారించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్