గొల్లప్రోలు: జాతీయ రహదారిపై 'ఆపరేషన్ సేఫ్ జర్నీ'

1488చూసినవారు
జాతీయ రహదారులపై పెరుగుతున్న బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం 'ఆపరేషన్ సేఫ్ జర్నీ'ని ప్రారంభించింది. శుక్రవారం రాత్రి చెందుర్తి, కత్తిపూడి వద్ద పోలీసులు, రవాణా, అగ్నిమాపక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. బస్సుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్