పాదగయలో ప్రత్యేక పూజలు చేసిన హరేరామ్ నాయక్

466చూసినవారు
పాదగయలో ప్రత్యేక పూజలు చేసిన హరేరామ్ నాయక్
శనివారం పిఠాపురంలోని ప్రసిద్ధ కుక్కుటేశ్వరస్వామి దేవస్థానాన్ని ఆర్డబ్యూఎస్ చీఫ్ ఇంజినీర్ ఎన్. హరేరామ్ నాయక్ సందర్శించారు. ఆలయ సహాయ కమిషనర్, ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆయనకు స్వాగతం పలికారు. హరేరామ్ నాయక్ దత్తాత్రేయ స్వామి, కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, పురుహూతికా అమ్మవారి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతను తెలుసుకుని, దేవస్థాన అభివృద్ధిపై ఆసక్తి చూపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్