అకాల వర్షం ప్రభావం: వరి పంటల పరిశీలన

389చూసినవారు
అకాల వర్షం ప్రభావం: వరి పంటల పరిశీలన
కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షం, సుడిగాలి కారణంగా మల్లవరం, చేబ్రోలు గ్రామాల్లో వరి పంటలు నేలకొరిగాయి. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయకుమార్, సహాయ వ్యవసాయ సంచాలకులు పి. స్వాతి పంట పొలాలను పరిశీలించి, నష్టంపై సమగ్ర నివేదికను పై అధికారులకు సమర్పించారు. ఈ పరిశీలనలో మండల వ్యవసాయ అధికారి కె. వి. వి. సత్యనారాయణ, రైతు సేవ కేంద్రం సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు. రైతులకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్