పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి మద్దతుగా పాలాభిషేకం

759చూసినవారు
పిఠాపురం నియోజకవర్గంలో రైల్వే స్టేషన్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 37.25 కోట్ల నిధులు మంజూరు చేయించిన నేపథ్యంలో, జనసేన నాయకులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ఓదురు కిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి కావాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, వీర మహిళలు భారీగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్