వేధింపుల కేసులో వ్యక్తి ఆత్మహత్య

972చూసినవారు
వేధింపుల కేసులో వ్యక్తి ఆత్మహత్య
పిఠాపురంలో మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడు జి. సతీష్, విచారణకు పిలవగానే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బుధవారం విచారణకు పిలవగా సతీష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని మొదట పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. గతంలో కూడా అమ్మాయిని వేధించిన కేసులో సతీష్ జైలుకు వెళ్లినట్లు ఎస్ఐ మణికుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్