ఈదురు గాలులతో మామిడి రైతులకు నష్టం..

360చూసినవారు
బుధవారం గొల్లప్రోలు మండలం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. బలమైన గాలులకు చెట్లపై ఉన్న మామిడి పండ్లు నేలరాలాయి. పండ్ల కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లే అవకాశం తగ్గి, ఆర్థిక నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవి వేడి వల్ల దిగుబడి తగ్గగా, ఈదురు గాలులు మరింత నష్టాన్ని పెంచాయని తెలిపారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్