ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర స్టేషనరీ వస్తువులు బలవంతంగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయరాదని మండల విద్యాశాఖ అధికారులు వెన్నా శ్రీనివాస్, బి. శివప్రసాద్ హెచ్చరించారు. తల్లిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రతి పాఠశాల నోటీస్ బోర్డులో గుర్తింపు పత్రం, ఫీజుల వివరాలు, విద్యాశాఖ అధికారుల ఫోన్ నంబర్లు ప్రదర్శించడంతో పాటు ఫిర్యాదుల కోసం కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.