శుద్ధి చేసిన తాగునీటినే సరఫరా చేయాలి: అక్షయ్

1010చూసినవారు
శుద్ధి చేసిన తాగునీటినే సరఫరా చేయాలి: అక్షయ్
యు. కొత్తపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రావు అక్షయ్, ప్రజలకు కొళాయిల ద్వారా సరఫరా చేసే తాగునీరు పూర్తిగా శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన జలమే కావాలని స్పష్టం చేశారు. గత నాలుగు రోజులుగా యు. కొత్తపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొళాయిల ద్వారా రంగు మారిన నీరు వస్తోందన్న ఫిర్యాదులు రావడంతో ఆయన నాగులపల్లి మంచినీటి కేంద్రాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన అక్షయ్, తాగునీటి ట్యాంక్ క్లీనింగ్ పనుల కారణంగానే నీటి రంగులో మార్పు కనిపించిందని తెలిపారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలని అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్