పిఠాపురం పట్టణంలోని కత్తుల గూడెంలో బుధవారం రాత్రి ఎస్సై మణికుమార్ 'పల్లె నిద్ర' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, స్థానికులను జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. బాల్య వివాహాలు నేరమని, వాటిని అడ్డుకోవడంలో గ్రామస్తుల సహకారం కోరారు. స్థానికులు తమ సందేహాలను ఎస్సైని అడిగి నివృత్తి చేసుకున్నారు. పోలీసులు రాత్రంతా వారితోనే గడిపారు.