పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా – ఇద్దరు పట్టుబాటు

506చూసినవారు
పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా – ఇద్దరు పట్టుబాటు
గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ప్రత్తిపాడు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కె. నాగబాబు, రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా, పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన పాలికి సుధాకర్, ఊట బుల్లిరాజు అలియాస్ రాజును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 18 పిడిఎస్ బియ్యం సంచులను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 1200 కిలోలు కాగా, మార్కెట్ విలువ రూ. 55,800. వాహనంతో కలిపి మొత్తం రూ. 2,55,800 విలువైన సరుకును అంచనా వేశారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు గొల్లప్రోలు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్