పిఠాపురంలో వేధింపుల కేసులో పోలీసు విచారణకు హాజరైన జి. సతీష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం పోలీసు విచారణకు హాజరైన సతీష్, అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు అతడిని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. గురువారం చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది.