పిఠాపురం: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ

307చూసినవారు
పిఠాపురం: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ
పిఠాపురం ఇందిరానగర్‌లో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సీ పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ జయరామ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశాలు, వాలంటీర్లు పాల్గొన్నారు. క్యాన్సర్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు వీడాలని, ముందస్తు పరీక్షల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని డాక్టర్ జయరామ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్