జల్లూరులో పీఎం సూర్య ఘర్ యోజన ప్రారంభం

476చూసినవారు
జల్లూరులో పీఎం సూర్య ఘర్ యోజన ప్రారంభం
పిఠాపురం నియోజకవర్గంలోని జల్లూరు గ్రామంలో పీఎం సూర్య ఘర్ యోజన కింద ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు సోలార్ విద్యుత్ సిస్టమ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో నిర్వహించబడింది. కాకినాడ జిల్లా కలెక్టర్ హరేందర ప్రసాద్ , జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, నాయకులు పెండెం దొరబాబు, ఓదురు కిషోర్ పాల్గొన్నారు. అధికారులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత విద్యుత్ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్